అన్నపూర్ణ స్టూడియో లో అగ్ని ప్రమాదం

annapurna studioహైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి రోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఎగసిపడిన అగ్నికీలలను అదుపు చేసేందుకు పలు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదం వల్ల సమీపాన గల ఫ్లోర్‌ సెట్టింగ్స్‌కు కూడా మంటలు వ్యాపించి కొంత నష్టం వాటిల్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బ్లాక్‌ బీలో ఒక ఫ్లోర్‌ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఇక ఈ అగ్నిప్రమాదంలో ఓ టీవీ పోగ్రామ్ కు చెందిన సెట్స్ దగ్దమైనట్లు తెలుస్తోంది.