GT vs LSG : గుజరాత్‌ ఖాతాలో మరో విజయం..


లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ పై గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ముందు 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (47), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (66) మాత్రమే రాణించారు. ఇక లక్నో బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, మార్కస్‌ స్టోయినిస్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అమిత్‌ మిశ్రా, నవీన్‌ ఉల్‌ హక్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఇక 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (68), కైల్ మేయర్స్(24), కృనాల్ పాండ్యా (23) తప్ప మిగతావారు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ చెరో రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

ఇకపోతే ఆఖరి ఓవర్ వేసిన మోహిత్ శర్మ అద్భుతం చేసాడు. చివరి ఓవర్లో లక్నోకు 12 పరుగులు అవసరం కాగా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాహుల్, స్టొయినిస్ లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. తర్వాతి బంతులకు బదోని, దీపక్ హుడాలు రనౌట్ అయ్యారు. దీంతో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.