కోట్లల్లో కొక్కొరొకొ.. కోళ్ళు

kodi pandaluసంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతికి ముగ్గులు వేయడం ఎంత కామనో.. ఈ పండక్కి పందెం కోళ్ళని ముగ్గులోకి దింపి కోట్లలో బెట్టింగులు కట్టడం అంతకంటే కామన్!. రోజువారి కూలీ నుంచి రాజకీయ నాయకుల వరకూ ఎవరి రేంజ్ లో వారు పదుల నుంచి కోట్ల వరకు పందేలు కడుతూనే ఉంటారు.

కోస్తా జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పాలకొల్లు మండలం లంకలకోడేరులో కోడిపందేలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు సమాచారం. కాగా, ఉంగుటూరు మండలం నారాయణపురంలో కోడిపందేలను పోలీసులు అడ్డుకుని , నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఈ కోడి పందేలు బహిరంగంగానే జరుగుతూన్నా చూసీ చూడనట్టు ఉంటున్నారని కొందరు ఆరోపిస్తునారు. ఉండి మండలం మహదేవపురంలో పెద్దఎత్తున కోడి పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తణుకు, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు చోటుచేసుకొనే బెట్టింగులను తలదన్నేలా జరిగే సంక్రాంతి కోడిపందేల బెట్టింగుల నిర్వాహకులు తమ ఈ వ్యాపారానికి భారీస్థాయిలో లాబీయింగ్ లు రికమెండేషన్ లు ఉపయోగిస్తుండటం కొసమెరుపు.