నరుని బతుక్కి పద్నాలుగు సాక్ష్యాలు

అన్ని జన్మల లోకి మానవ జన్మ ఉత్తమ మైనది. అనేక జన్మల పుణ్యం వలన మనిషిగా పుడతాం అనేది మన శాస్త్ర సారం. అలాంటి మానవజన్మ లో మనం ఎం చేసిన చెల్లుతుందని చేయకూడని పనులన్నీ చేస్తున్నాం.
పాపభీతి ఉన్నవాళ్లు దేవుడి దగ్గరకి వెళ్లి ముడుపులు రూపం లో దేవుడుకి వాటా ఇస్తున్నారు.
ఎవరు చూడరు ఎవరికీ తెలియదు అనుకుంటున్న మనం, మనచుట్టూ 24 గంటలు ఉన్న 14 సాక్షులు గూర్చి తెలుసుకోవాలి.
అంతా పంచ భూతాల సాక్షిగా, మనసాక్షిగా అంటారు, అంటే మనం ఈ ఆరు మాత్రమే అనుకుంటాం.
అది మన పొరపాటు.. దేవుడు ఉన్నాడు అని మనందరి నమ్మకం భయం, భక్తి అన్నీ…. కానీ మనం దేవుడ్ని చూడలేదు. కానీ మనకి రెండు ప్రత్యక్ష దైవాలు ఉన్నాయి. ఒకరి తరవాత ఒకరు మనల్ని నిత్యం చూస్తూ ఉంటారు.
ఇప్పుడు 14 సాక్ష్యాలెంటో చూద్దాం.
పంచభూతాలు అయిన వాయువు, ఆకాశం, అగ్ని, నీరు, భూమి, ప్రత్యక్ష దైవా లైన సూర్యుడు, చంద్రుడు. ఇంకా యముడు, పగలు, రేయి, ఉదయం, సాయంకాలం, ధర్మం, మనస్సు,
ఈ 14 మన నడత కీ నడవడిక కీ సాక్ష్యాలు. ఈ విషయాన్నీ వేమన కూడా హెచ్చరించాడు.
ఆంతరంగ మందు అపరాదాములు చేసి
మంచి వాని వలే మనుజుడుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడేరుగడా?
విశ్వదాభిరామ వినురవేమ!
తస్మాత్ జాగ్రత్త.