ఓవర్ కోట్లపై వెల్లువెత్తిన నిరసన

pundhucherry school girlsపాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఓవర్కోట్ తప్పనిసరి అన్న పుదుచ్ఛేరి ప్రభుత్వం నిబంధనలు పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విద్యార్థిసంఘాలు, మహిళా సంఘాలు ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నాయి. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. స్ర్తీలు, బాలికల మీద నేరాలు తగ్గేందుకు వస్తధ్రారణలో మార్పు తేవాలని భావించి పుదుచ్చేరి ప్రభుత్వం విద్యార్థినులు విధిగా ఓవర్కోట్ ధరించాలన్న ప్రతిపాదన తెచ్చింది. స్ర్తీలపై నేరానికి స్ర్తీలే బాధ్యులని భావించడం వల్లనే ఇలాంటి ప్రతినాదలు తెస్తున్నారని, ఇది చాలా తప్పుడు ఆలోచన అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.