న్యూ ఇయర్ ఎఫెక్ట్ : రెడ్ అండర్ వెర్ సెంటిమెంట్, ఎక్కడో తెలుసా ?

ఇండియా లో కొత్త సంవ‌త్స‌రంలో శుభం క‌ల‌గాల‌ని దేవాల‌యాల‌కు వెళ్ళ‌డం, శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డం వంటివి చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో విచిత్ర‌మైన సంప్ర‌దాయాలున్నాయి. ద‌క్షిణ ఆఫ్రికాలో ప్ర‌జ‌లు కొత్త సంవ‌త్స‌రం రోజున న‌లుపు క‌న్ను ఉన్న బ‌ఠానీ గింజ‌ల‌ను తిన‌డం శుభంగా భావిస్తారు. స్పెయిన్ లో రాత్రి 11.55 గంట‌ల‌కు నెల‌కు ఒక‌టి చొప్పున 12 ద్రాక్ష పండ్లు తింటారు. చాలామంది అమెరిక‌న్ల‌లో ఈనాటికీ ఒక విచిత్ర‌మైన న‌మ్మ‌కం ఉంది. కొత్త సంవ‌త్స‌రం రోజున ఎర్ర రంగు అండ‌ర్ వేర్ వేసుకుంటే చాలా శుభం క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు. అంటే డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రే ఈ ఎర్ర రంగు అండ‌ర్ వేర్ వేసుకుంటారు. ఇదే సంప్ర‌దాయం అమెరికా కంటే ముందు స్పెయిన్, ఇట‌లీ, చైనా దేశాల్లో కూడా ఉండేది. అయితే అమెరికన్లు చాలామంది ఈ ప‌ద్ద‌తి కొన‌సాగించారు. ప్ర‌పంచం టెక్నాలజీ లో ముందుకెళుతున్నా.. కొన్ని దేశాల్లో ఇలాంటి న‌మ్మ‌కాలను విశ్వ‌సిస్తూనే ఉండ‌డం విశేషం.