సంక్రాంతికి ప్రత్యేక బస్సులు : ఆర్టీసీ

rtc busసంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు 4,410 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి 14 వరకు ఈ బస్సులు నడుపుతామని అధికారులు పేర్కొన్నారు . ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. రిజర్వేషన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది.