ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ అయ్యంగార్ కి విష్ణువుని అందించిన సాయి కొర్రపాటి

న్యూస్ చానెళ్లు, ఆధ్యాత్మిక ప్రత్యేక ఛానెళ్లూ , సోషల్ మీడియా విస్తృతత పెరిగినా కూడా ప్రముఖ రచయిత, ఆర్షవైభవ గ్రంధాల సంకలనకర్త , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంధాల హవా తెలుగు భక్త సమాజాల్లో అపూర్వంగా కొనసాగుతూనే వుంది.

కేవలం తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఈ దేశంలోని అనేక రాష్ట్రాల తెలుగు లోగిళ్ళలో సైతం ఇప్పటికే పురాణపండ శ్రీనివాస్ ‘ శ్రీపూర్ణిమ ‘ అఖండ మహా గ్రంధానికున్న ఆదరణ అనూహ్యమనే చెప్పాలి.

ఒక పుస్తకాన్ని ఎలా తయారు చెయ్యాలో, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో , ఎలాంటి సొగసైన భాషని ప్రెజెంట్ చెయ్యాలో , ఎక్కడ స్తోత్రాల్ని లేదా ధార్మికమైన అపురూప అంశాల్ని , కథాకథన సంవిధానాన్ని ఇవ్వాలో , అమోఘమైన వ్యాఖ్యానాన్ని అందించి ఆకట్టుకోవాలో పురాణపండ శ్రీనివాస్ కి చక్కగా తెలుసు కాబట్టే … దశాబ్దన్నర కాలంగా నానాటికీ పురాణపండ శ్రీనివాస్ బుక్స్ అంటే తెలుగు పాఠకలోకం దేశాల ఎల్లలుదాటి మరీ శ్రీనివాస్ బుక్స్ ని తలపై పెట్టుకుని మరీ ఆదరిస్తున్నారు.

జీవన యాత్రలో ఎన్నో, ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్న శ్రీనివాస్ తన జీవన వైభవంలో నిస్వార్ధతకు అధిక ప్రాధాన్యత ఇస్తారని పరిచయమున్న ప్రతీ ఒక్కరికీ ఎరుకే.

ఈ వైకుంఠ ఏకాదశికి కూడా తిరుమల మొదలు సింహాచలం వరకు ప్రధాన వైష్ణవ క్షేత్రాల్లో సుమారు 25 శ్రీ వెంకటేశ్వరస్వామి , శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలలో సైతం శ్రీనివాస్ ప్రత్యేక గెటప్ లో రూపొందించిన నాలుగు శ్రీవైష్ణవ స్తోత్ర శోభల వ్యాఖ్యానాల ‘ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధం వేలకొలది భక్తులకు ఉచితంగా అంది వేనోళ్ళ ప్రశంసల్ని అందుకుంది.

వైకుంఠ ఏకాదశి పుణ్యదినవేళ అనుకోకుండా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైద్రాబాద్ వఛ్చిన భారతదేశ కేంద్రప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఐసిఎమార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.ఎస్.జి.అయ్యంగార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రముఖ నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ‘ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ‘ ప్రత్యేక గ్రంధాన్ని అందజేసి కాస్సేపు యోగ క్షేమాల్ని ముచ్చ్చటించి వెళ్లడం విశేషంగానే చెప్పక తప్పదు.

ఈగ , లెజెండ్ వంటి అద్భుత చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరుపొందిన వారాహి చలన చిత్రం సంస్థకు అధినేత అయిన సాయి కొర్రపాటి గత సంవత్సరం ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ తో కలిసి ఈ దేశ కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా ను కలిసి మొట్ట మొదటి హనుమాన్ మంత్రం తంత్ర యంత్ర మహోన్నత గ్రంధాన్ని ఆవిష్కరింప చేసి … ఇటు ఆరెస్సెస్ వర్గాల్ని, అటు బాజాపా వర్గాల్ని మాత్రమే కాకుండా ఈ దేశ పండిత, కవి, రచయితల వర్గాల్ని కూడా ఆకర్షించారని నిస్సందేహంగా చెప్పాల్సిందే.

బాహుబలి, RRR వంటి మహోన్నత చలనచిత్రాలు దర్శకధీరుడు రాజమౌళి సైతం తనకు అత్యంత ఆప్త స్నేహితుడు సాయి కొర్రపాటి అని తన ట్విట్టర్ మరియు పేస్ బుక్ ఖాతాలో ప్రకటించదాయాన్ని కూడా కోట్లమంది వీక్షించి హ్యాట్స్ఆఫ్ చెప్పడం కూడా మన కన్నుల ఎదుటే కనిపించిన సత్యం.

సాయి కొర్రపాటి ధార్మిక అంశాల పట్ల చూపిస్తున్న ఆసక్తిని జి ఎస్ జి అయ్యంగార్ అభినందించడాన్ని సినీ ప్రముఖులు సైతం అభినందనలు వర్షిస్తున్నారు.

జీవన యాత్రలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధార్మిక చైతన్యాన్ని ఏ స్వార్ధం లేకుండా అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ తనకి రెండు దశాబ్దాలుగా తెలుసని, తాను ఏ శాఖలో ఉన్నతాధికారిగా వున్నా … అక్కడికి శ్రీనివాస్ బుక్స్ అందుతూనే ఉండేవని ప్రత్యేకంగా శ్రీనివాస్ కృషిని ప్రశంసించారు.

పోతే … తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాతినిధ్యంగా హైద్రాబాద్ జూబిలీ హిల్స్ లో మహా విశాల ప్రాంగణంలోనూ , అహోబిల మఠం ప్రాతినిధ్యంగా హైద్రాబాద్ అహోబిల మఠ్ ప్రాంగణంలో సైతం వైకుంఠ ఏకాదశి నుండి సంక్రాంతి వరకూ పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలనే సాయి కొర్రపాటి సాయి అనుచరులు , దేవాలయ సిబ్బంది పంచడం భక్త బృందాల్ని చాలా ఆకట్టుకోవడం గమనార్హం.

ఈ సందర్భంగా టి.టి.డి ఆలయానికి దర్శనానికి విచ్చేసిన పురాణపండ శ్రీనివాస్ కి దేవస్థాన సంప్రదాయ విలువల మధ్య తిరుమల తిరుపతి దేవస్థాన వేదపండితులు . వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు.