క్వార్టర్ ఫైనల్ లో సైనా

Saina-Nehwalకొరియా ఓపెన్ సిరీస్ లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. రెండో రౌండ్ లో సింగ్ పూర్ షట్లర్ మింగ్టియాన్ పై 21-16, 21-9, తో సైనా విజయం సాధించింది. మరోమైపు పి.వి. సింధు, పారుపల్లి కశ్యప్ కొరియా ఓపెన్ నుంచి నిష్క్రమించారు. థాయ్ లాండ్ షట్లర్ పోర్న్ టివ్ చేతిలో 19-21, 13-21 తేడాతో సింధు ఓడిపోగా, హాంకాంగ్ ఆటగాడు యున్ హూ చేతిలో 21-16, 13-21, 17-21 తేడాతో కశ్యప్ పరాజయం పాలయ్యాడు.