చావెజ్ ప్రమాణస్వీకారం వాయిదా

Chavez inaugurationవెనిజులా అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన చావెజ్ ఊపితిత్తుల ఇన్ ఫెక్షన్ తో క్యూబా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు ముందు చావెజ్ ప్రమాణం చేస్తారని ఉపాధ్యక్షుడు నికోలన్ మడురో వెల్లడించారు. ముందు నిర్ణయించిన ప్రకారం చావెజ్ గురువారం జాతీయ అసెంబ్లీ ముందు ప్రమాణం చేయాలి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారని వెనుజుల ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. మరోమైపు రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.