వీఆర్ ఓ ప్రశ్నాపత్రం లీక్.. ??

VRO-paper-leak

రేపు జరగబోయే వీఆర్ ఓ, వీఆర్ ఏ ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు సమాచారమ్. గతంలో ఎంబీబీఎస్ ప్రశ్నాపత్రాలను లీక్ వ్యవహారంలో.. హస్తమున్నట్లుగా తేలిన గురివి రెడ్డి గ్యాంగ్ మరోసారి రంగంలోకి దిగినట్లు సమాచారం. నంధ్యాలలో నిందితుల గ్యాంగ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. బ్లూటూత్ సహాయంతో..  కొంత మంది ద్వారా అభ్యర్థులకు జవాబులు అందజేసే విధంగా గురువు రెడ్డి గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల 10 మందిని అదుపులోనికి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ముఠా విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్త తెలియడంతో.. ఇన్నాళ్లు కష్టపడి పరీక్షకు సన్నద్దం అయిన విధ్యార్థుల్లో ఆందోళన నెలకొంది.