వాట్సాప్ లో కొత్త ఫీచర్.. పంపిన మెసేజ్ ఎడిట్ చేయొచ్చు


వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పటివరకు వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే మెసేజ్ డిలీట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అంతేకాదు మెసేజ్ మీనింగ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో మెసేజ్ డిలీట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం వాట్సాప్ ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో స్వయంగా దీని గురించి వెల్లడించారు. దీంతో ఇక నుంచి ఏదైనా తప్పు మెసేజ్ పంపిస్తే దానిని డిలీట్ చేయాల్సిన పని లేదు. దానినే ఎడిట్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపించిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు.. కానీ 15 నిమిషాలు దాటిన తర్వాత మెసేజ్‌లను ఎడిట్ చేయడం కుదరదు. ఇక మెసేజ్‌ను ఎడిట్ చేయాలంటే ముందుగా పంపిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు కాపీ, సెలక్ట్, ఫార్వర్డ్ ఆప్షన్లతో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ముందుగా పంపిచిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.