హొలీలో రంగులు కాదు తేళ్లు చల్లుకుంటారు.. ఎక్కడో తెలుసా ?


హోలీ పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు, కులమతాలకతీతంగా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు రంగుల వానలో తడిచి ముద్దవుతారు. ఇక హోలీ పండుగ వేడుకలు ఒక్కో ప్రాంతంలో వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. అయితే ఎక్కడైనా రంగులు, కోడిగుడ్లు, బెలూన్లు, టమాటాలతో హోలీ ఆడటం కామనే. కానీ, ఉత్తరప్రదేశ్‏లోని ఓ గ్రామంలో మాత్రం అక్కడి ప్రజలు విషపూరితమైన తేళ్లతో హోలీ ఆడతారు. అవును మీరు చదివింది నిజమే. చిన్నా, పెద్దా అన్న తేడాలేదు ఆ గ్రామంలోని వారంతా తేళ్లను చేతుల్లో పట్టుకుని మరీ హోలీ పండుగను జరుపుకుంటారు.

ఉత్తరప్రదేశ్‏లోని సౌత్నా గ్రామంలో ఓ పురాతన కోట ఉంది. ఆ కోటలో వేలాదిగా ఇటుకలు, రాళ్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఈ ఇటుకలను తీసినప్పుడు ఏమి కనిపించవు.. కానీ హోలీ పౌర్ణమి రెండో రోజు సాయంత్రం మాత్రం ఈ కోటలో ఏ ఇటుక కదిపినా వేలాదిగా తేళ్లు బయటకు వస్తాయి. ఈ సమయంలో గ్రామంలోని పెద్దలు , పిల్లలు కోటకు చేరుకుని ఆ తేళ్లను తమ చేతుల్లోకి తీసుకుని రంగులు చల్లుకున్నట్లు వారు తేళ్లను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇకపోతే విషపూరితమైన ఈ తేళ్లు హోలీ రోజు మాత్రం ఎలాంటి హాని చేయవని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. అంతేకాదు ఈ తేళ్లను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారంట.

ఇదిలా ఉండగా అసలు చెప్పాలంటే ఇప్పుడు హోలీ పండుగ అర్ధమే మారిపోయింది. ఈ రోజుల్లో హోలీ అంటే రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోవడం, నెత్తి మీద కోడిగుడ్లు కొట్టుకోవడం, దావత్ చేసుకోవడం. కానీ అప్పటి రోజుల్లో అయితే విరగబోసిన మొదుగు పూలను, తంగేడు పూలను తెంపి రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో నీళ్లను పోసి కలిపి మీద చల్లుకుంటూ హోలీ ఆడేవారు. హోలీ అంటే అగ్నికి సంబంధించినది. దీన్నే ‘హోలీకా పూర్ణిమ’ అని అంటారు. ఈ సమయంలో కాముని దహనం, డోలికోత్సవం వేడుకలను జరుపుకుంటారు.

అమెరికాలో అభిమానులతో ఎన్టీఆర్..