జోరుగా కొనసాగుతున్న ఆరోదశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ ఆదివారం మొదలు అయ్యింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం తో ప్రజలంతా ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు. అలాగే సెలబ్రిటీస్ సైతం ఉత్సహంగా పోలింగ్ లో పాల్గొంటూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, భాజపా భోపాల్‌ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, మాజీ క్రికెటర్‌, దిల్లీ తూర్పు నియోజకవర్గం భాజపా అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విడతలో కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్‌, హర్షవర్ధన్‌, మేనకాగాంధీ, నరేంద్రసింగ్‌ తోమర్‌, రావు ఇంద్రిజిత్‌సింగ్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌, కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌, భూపీందర్‌సింగ్‌ హుడా, జ్యోతిరాదిత్య సింధియా, షీలాదీక్షిత్‌, బాక్సింగ్‌ క్రీడాకారుడు విజేందర్‌సింగ్‌, మాజీ క్రికెటర్‌, దిల్లీ తూర్పు భాజపా అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ వంటి వారు పోటీలో నిలబడ్డారు.