మూడో విడతలో పోలింగ్ శాతం ఎంతో తెలుసా..?

దేశ వ్యాప్తంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తి కాగా..మంగళవారం మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయ్యింది. దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశాంతంగా ముగిసింది.

ఇక మూడో విడత లో మొత్తం 63.24 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 79.36 శాతం పోలింగ్‌ నమోదైంది. జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 12.86 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 60.21 శాతం పోలింగ్ నమోదైంది. ఇక కర్ణాటకలో 64.14 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. కేరళలో 70.21 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవాలో 71.09 శాతం మంది, మహారాష్ట్రలో 56.57 శాతం మంది, అసోంలో 78.29 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు.