రివ్యూ : మౌగ్లీ | Mowgli Movie Review

Mowgli Movie Review
Mowgli

తెలుగుమిర్చి రేటింగ్ : 3/5

యాంకర్ సుమ కనకాల – నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మౌగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’తో నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ముందుగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? లేదా అన్నది చూద్దాం.

కథ ఏమిటంటే…

పార్వతిపురం అనే గ్రామంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మౌగ్లీ (రోషన్ కనకాల) అనాథగా పెరుగుతాడు. తండ్రిలా పోలీస్ ఆఫీసర్ కావాలన్నదే అతని కల. అదే గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో డబ్బుల కోసం డూప్‌గా పనిచేయడం ద్వారా జాస్మిన్ (సాక్షి మడోల్కర్)తో పరిచయం ఏర్పడుతుంది. ఒక సంఘటన కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) జాస్మిన్‌పై మోజు పడతాడు. ఈ పరిస్థితుల్లో మౌగ్లీ జాస్మిన్‌ను కాపాడగలిగాడా? అతని ప్రేమ, కల నెరవేరాయా? అన్నది కథాంశం.

Also Read :  Ranveer Singh: రూ. 3,200 కోట్ల కలెక్షన్స్.. రూ. 325 కోట్ల షేర్! ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన రణ్‌వీర్ సింగ్..

విశ్లేషణ :

‘బబుల్‌గమ్’తోనే నటనలో మంచి మార్కులు కొట్టేసిన రోషన్ కనకాల, ఈ చిత్రంలో మరింత పరిపక్వత చూపించాడు. రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఇంప్రెస్ చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్లస్ అయ్యాయి.

హీరోయిన్ సాక్షి మడోల్కర్ తన అందం, కళ్లతోనే భావాలు పలికిస్తూ మెప్పించింది. టీజర్ నుంచే ఆకట్టుకున్న బండి సరోజ్ కుమార్ నటన ఈ సినిమాకు పెద్ద హైలైట్. అతని క్యారెక్టర్ డిజైన్, డైలాగ్స్ బాగా వర్క్ అయ్యాయి. హర్ష చెముడుకి కూడా మంచి పాత్ర దక్కింది.

Also Read :  Peddi OTT release: వచ్చే వారమే ఓటీటీలోకి ‘పెద్ది’.. రిలీజ్ డేట్ ఇదే

దర్శకుడు సందీప్ రాజ్ ఈసారి లవ్ స్టోరీకి కమర్షియల్ అంశాలను జోడించే ప్రయత్నం చేశాడు. అయితే ‘కలర్ ఫోటో’ స్థాయిలో భావోద్వేగాన్ని ఆశించి వెళ్తే కొంత నిరాశ తప్పదు. కథ, కథనంలో పెద్దగా కొత్తదనం లేకపోవడం, లెంగ్త్ కొంచెం ఎక్కువగా అనిపించడం మైనస్ పాయింట్స్.

కాల భైరవ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ప్రొడక్షన్ విల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

తుది మాట

మొత్తానికి ‘మౌగ్లీ 2025’ సినిమాలో రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్ నటనలు ప్రధాన ఆకర్షణలు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

తెలుగుమిర్చి రేటింగ్ : 3/5