యాపిల్ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనట.

Apple-red2

యాపిల్ సంస్థ నుండి ఇప్పటివరకు రకరకాల మోడల్స్ మార్కెట్లోకి వచ్చిన సంగతి తెల్సిందే..అయితే వీటిల్లో ఇప్పయివరకు రెడ్ కలర్ లో ఏ ఫోన్ రాలేదు. మొదటి రెడ్ కలర్ తో ఐఫోన్ 7 మోడల్‌ ను ఈ నెల 24 న మార్కెట్లోకి రిలీజ్ చేయబోతుంది. యాపిల్ వినియోగదారులంతా రెడ్ కలర్ లో లాంచ్ చేయడమేంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యం లో సంస్థ రెడ్ కలర్ వెనుక ఉన్న అసలు రహస్యం చెప్పింది.

Apple-red

యాపిల్ సంస్థ సేల్స్ పెంచుకోవడం కోసం ఈ కలర్ ఫోన్‌ను మార్కెట్లోకి తేవడం లేదు, ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఓ సంస్థకు నిధుల సమీకరణ కోసం యాపిల్ ఇలా ఫోన్‌ను రెడ్ కలర్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియెంట్ 128 జీబీ, 256 జీబీ మోడల్స్ లో విడుదల కానుండగా, దీని ప్రారంభ ధర 749 డాలర్లుగా నిర్ణయించారు.