స్నాప్ డీల్ లో ఇక అవి దొరకవ్…!

ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ నకిలీ వస్తువులను విక్రయిస్తుందా అంటే అవుననే సమాధనమే వినిపిస్తుంది. తమ బ్రాండ్ కి చెందిన నకిలీ వస్తువులను స్నాప్ డీల్ ఆన్ లైన్ లో సేల్ చేస్తుందంటూ జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ కాసియో కోర్టు మెట్లెక్కింది. ఈ మేరకు ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ వస్తువుల ప్రకటనలు, అమ్మకాలను నిలిపివేయాలంటూ మధ్యంతర నిషేధ ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది.

 

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు కాసియోకి చెందిన బ్రాండ్‌ వాచెస్‌, కాలిక్యులేటర్‌ల నకిలీ అమ్మకాలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదుల మేరకు స్నాప్‌డీల్‌ కూడా చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు తెలిపింది. అయితే కోర్టు ఆదేశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిందిగా కోరతామని స్నాప్‌డీల్ తెలిపింది. తమ ప్లాట్ ఫామ్ లో బ్రాండెడ్ వస్తువుల విషయంలో సెల్లర్లను పునర్ సమీక్షస్తామంది స్నాప్ డీల్.