పేస్ బుక్ లో సరికొత్త టూల్‌..

fb-chatసోషల్ మీడియా మాధ్యమం పేస్ బుక్ ఎంతటి ఆదరణ పొందిందో తెలియంది కాదు..చిన్న ,పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇందులో ఖాతా ఓపెన్ చేసి తమ ఫ్రెండ్స్ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు..తాజాగా పేస్ బుక్ లో సరికొత్త టూల్ ను ప్రవేశ పెట్టారు..ఈ టూల్ యూజర్లకు ఎంతగానో ఉపయోగకరమైందని చెపుతున్నారు..ఇక ఆ టూల్ విషయానికి వస్తే..

రికమండేషన్స్ పేరిట ఈ టూల్ ను ప్రవేశ పెట్టారు. ఈ టూల్‌ ద్వారా స్నేహితుల సలహాలు కోరడం, సలహాలు పొందడం వంటివి ఈజీ అవుతుందని సంస్థ చెపుతుంది. ఈ టూల్ ఎలా యూజ్ చేయాలంటే స్థానిక ప్రదేశాలు, సేవలకు సంబంధించి ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో సలహా కోసం ప్రయత్నించినప్పుడు.. అది రికమండేషన్ పోస్ట్‌గా మారిపోతుంది. మీ పోస్ట్‌ దిగువన మిత్రుల సలహాలు, సూచనలు కనిపిస్తాయి. కావాలనుకుంటే రికమండేషన్స్‌ బుక్‌మార్క్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్ సలహాలను కోరే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం డెస్క్‌టాప్‌ యూజర్లకు మాత్రమే.

fb-tul