మార్కెట్లోకి హెగ్జా..

hexaప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..భారత మార్కెట్లోకి సరికొత్త యుటిలిటీ వాహనాన్ని లాంచ్ చేసింది..హెగ్జా పేరిటా ఈ వాహనాన్ని విడుదల చేసింది. ఈ వాహన ప్రారంభ ధరను రూ.12.08 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. టాప్ ఎండ్ మోడల్ (ఆటోమెటిక్ వెర్షన్) రూ.17.43 లక్షలకు లభించనుంది.

టయోటా ఇన్నోవా, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, మారుతి ఎర్టిగాలకు పోటీగా సంస్థ ఈ కారును విడుదల చేసింది. 2.2 లీటర్ వారికోర్ 400 డీజిల్ ఇంజిన్‌తో డిజైన్ చేసిన హెగ్జా మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటిలో మూడు మాన్యువల్ కాగా, మరో మూడు ఆటోమెటిక్ వేరియంట్లు. ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన ఈ వెహికిల్ లీటరుకు 14.4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.