హోండా కార్స్ రీకాల్ చెయ్యాలి..

honda-recallకార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) భారీ స్థాయిలో వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2003 నుంచి 2012 మధ్యకాలంలో తయారైన 2.24 లక్షల కార్లలో ఎయిర్‌బ్యాగ్‌కు సంబంధించిన సమస్యలు రావడంతో రీకాల్ చేయాలని కంపెనీ సూచించింది. రీకాల్ చేయనున్నవాటిలో ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలైన సీఆర్-వీ, సెడాన్స్, సివిక్, సిటీతోపాటు హ్యచ్‌బ్యాక్ విభాగానికి చెందిన జాజ్ సైతం ఉన్నాయి.

వచ్చే నెల 12 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్ల వద్దకు వెళ్లి ఎయిర్‌బ్యాగ్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించుకోవాలని వినియోగదారులకు సంస్థ సూచించింది.