ఐఫోన్ 8 ఫీచర్స్ లీకయ్యాయి .

iphone8-black

ఐఫోన్ సంస్థ కు 2016 పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి..ఎందుకంటే ఈ కంపెనీ నుండి ఎన్ని కొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి వచ్చిన వినియోగాదరాలు పెద్దగా ఆసక్తి చూపక పోవడం తో, 2017 లో తన ఉనికిని చాటాలని సంస్థ ప్లాన్ చేస్తుంది. త్వరలోనే ఐఫోన్ 8 మార్కెట్లోకి రాబోతున్న సంగతి తెల్సిందే.. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ లతోపాటు ఐఫోన్ 8ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు సమాచారం. తాజాగా మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 8.. ఐఫోన్ 7 ప్లస్ కంటే చిన్నగా ఉందనున్నదని సమాచారం.

iphone-8-concept

ఇప్పటి వరకు యాపిల్ విడుదల చేసిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కానుంది. ఐఫోన్ 8లో మొత్తం స్క్రీన్ 5.8 అంగుళాలు అయినా ఉపయోగంలో మాత్రం 5.15 అంగుళాలు మాత్రమే ఉండబోతుంది. అలాగే వైర్‌లెస్ చార్జింగ్ సదుపాయం ఉండబోతుందట.