రూ.22 కే ఐడియా అపరిమిత 3జీ/4జీ డాటా..

idea-4g

టెలికం రంగం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకెళ్ళేతున్న ఐడియా..ప్రస్తుతం మిగత టెలికం సంస్థలకు గట్టి పోటీని ఇస్తూ వినియోగదారులకు సరికొత్త ఆఫర్స్ ను ప్రకటిస్తుంది..త్వరలోనే గంటల చొప్పున వాయిస్, డాటా ప్యాక్‌లను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. వీటిలో అపరిమిత డాటా ప్లాన్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.

Idea-Offers

తాజాగా మార్కెట్లో అందుతున్న సమాచారం మేరకు రూ.22తో రీచార్జ్ చేసుకుంటే ఒక గంటపాటు ఆన్ లిమిటెడ్ 3జీ/4జీ డాటాను ఉపయోగించుకోవచ్చని వినియోగదారులకు ఐడియా ఎస్‌ఎంఎస్‌లు పంపుతోందట. ఈ ఆఫర్ జనవరి 19 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది..మరోవైపు వోడాఫోన్ కొన్ని రోజుల కిందటే గంటల డేటా ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే..మరోపక్క వినియోగదారులు మాత్రం ఇదంతా జియో ఎఫెక్ట్ అని చెపుతున్నారు..