ఐడియా సరికొత్త డేటా ఆఫర్.

idea-4g

టెలికం రంగం లో ఏర్పడుతున్న పోటీని తట్టుకునేందుకు రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను కాపాడుకునే పనిలో టెలికం సంస్థలు పోటీపడుతున్నాయి..తాజాగా ఐడియా తమ కస్టమర్లకు సరికొత్త డేట్ ఆఫర్ ప్రకటించి వారిని సంతోష పెట్టెంది. ఇప్పటివరకు డేట్ ధరలు 2జీ, 3జీ, 4జీ లను బట్టి ఉండేది..కానీ మార్చి 31 తర్వాత వీటి అన్నిటికి కలిపే ఒకే ధర ఉండేలా ఐడియా నిర్ణయం తీసుకుంది.

idea-new-offers
ప్రస్తుతం రూ.170తో రీఛార్జి చేసుకుంటే 1జీబీ 2జీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే 1జీబీ 4జీ డేటాకు మాత్రం రూ.123తో రీఛార్జి చేసుకుంటే సరిపోతోంది. ఈ నేపథ్యంలో అన్నింటికీ కలిపి ఒకే ధరను నిర్ణయించనున్నట్లు ఐడియా తెలిపింది. వినియోగదారులకు హైస్పీడ్‌ డేటా ప్లాన్స్‌ను అందించేందుకు మరిన్ని ఆఫర్లు తీసుకొస్తామని ఐడియా ప్రకటించింది.