జియో దెబ్బకు వొడాఫోన్, ఐడియా విలీనం

idea-vodafone-Vilinam

జియో రాకతో అప్పటివరకు లాభాలతో ఉన్న టెలికం సంస్థలు నష్టాల బాట పట్టాయి. ఎన్నడూలేని విధంగా ఆఫర్స్ ప్రకటిస్తూ తమ కస్టమర్లను కాపాడుకునేందుకు పోటీ పడ్డాయి. ఇక టాప్ సంస్థలుగా ఓ వెలుగు వెలిగిన వొడాఫోన్, ఐడియా విలీనం కాబోతున్నాయని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ రోజు రానే వచ్చింది. జియో దెబ్బలు ఈ రెండు విలీనం కాక తప్పలేదు.

Idea-Offers

ప్రస్తుతం ఉన్న విపరీత పోటీ మధ్య విలీనం ఒక్కటే సరైనదని వొడాఫోన్, ఐడియా నిర్ణయించాయి. వొడాఫోన్‌తో విలీనానికి ఐడియా బోర్డు సభ్యులు అంగీకారం తెలిపారు. 4.9 శాతం వాటాలను ఐడియా ప్రమోటర్లకు బదిలీ చేయనున్న వొడాఫోన్‌కు కొత్తగా ఏర్పడనున్న సంస్థలో 45.1 శాతం వాటా దక్కనుంది. కుమార మంగళం బిర్లా, ఇతర ఐడియా ప్రమోటర్లకు 26 శాతం వాటాలు ఉండనున్నాయి. రెండేళ్లలోగా విలీనం ప్రక్రియ పూర్తి కానుంది. చైర్మన్‌ను నియమించే హక్కు ఐడియాకే దక్కనుండగా, సీఎఫ్‌వోను వొడాఫోన్ నామినేట్ చేయనుంది.