జియో ఫోన్ ఇదిగో..

jio-net-offer

జియో ఈ పేరు చెపితే చాలు టెలికం రంగం దద్దరిల్లిపోతుంది..ఉచిత కాల్స్ , ఉచిత డేటా, ఉచిత వీడియో కాల్స్ ఇలా అన్ని ఉచితం అంటూ జియో ప్రకటించడం తో అందరూ జియో కోసం పరుగులు పెట్టారు..ప్రస్తుతం చాల మంది జియో నెట్ వర్క్ ను యూస్ చేస్తున్నారు..2017లో అతి తక్కువ ధరలో 4జీ సౌకర్యాలు ఉన్న మొబైల్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామని రిలియన్స్ ప్రకటించిన సంగతి తెల్సిందే..అయితే ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది..ఏ టైపు లో ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..వారి చూపులకు తేరా పడింది. తాజాగా జియో ప్రవేశపెట్టబోయే ఆ ఫోన్ లుక్ బయటకు వచ్చింది. దాదాపుగా 1500 రూపాయలు విలువ గల ఈ మొబైల్ బేసిక్ మోడల్ లోనే కీ ప్యాడ్ తోనే రానుండగా, ఇందులో 4జీ సౌకర్యాలు కల్పించడం అనేది అదనపు ఆకర్షణ.

Reliance-Jio-4G-VoLTE-Phone

ఇందు కోసం ‘జియో’ యాప్స్ ను యాక్టివేట్ చేసుకునే విధంగా మరో నాలుగు బటన్స్ ను అదనంగా చేర్చడం ఫోటోలో చూడవచ్చు. ఈ మార్చి లోపున మార్కెట్ లోకి తీసుకురావాలని, ముఖ్యంగా రూరల్ మార్కెట్ ను ఈ ఫోన్ తో ఏలాలని ‘జియో’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతోంది.