‘కవాసకీ’ నుండి మరో ఐదు కొత్త మోడల్స్

Cowasakiజపాన్‌కు చెందిన లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకీ వచ్చే రెండేండ్లలో మరో ఐదు కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. వచ్చే మార్చిలోగా రెండు వాహనాలను విడుదల చేయనున్న సంస్థ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా మూడింటిని అందుబాటులోకి తీసుకవచ్చేల ప్లాన్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కొత్త షో రూం ని కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ షిగెతో నిషికవా ప్రారంభించారు.