ఈ బైక్ జస్ట్ కోటి పైనేనట..

koti-bike

ఇప్పటివరకు కోటి కార్ చూసే వామ్మో కార్ కు కోటి పెడతారా…అని అనుకుంటాం ..కానీ కోటి పెట్టి బైక్ తీసుకునే ఇంకేం అనాలి చెప్పండి…కోటి బైక్ ఉందా అని అనుకుంటున్నారా..తాజాగా ఇటాలియన్‌ మోటర్‌సైకిళ్ల దిగ్గజం డుకాటీ సంస్థ 1299 సూపర్‌ లెగేరాను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

దీని ధర ను రూ.1.12కోట్లు..దిల్లీ ఎక్స్‌షోరూం ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న బైకుల్లో ఇదే అత్యంత ఖరీదైంది. ఇక ఈ బైక్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని సంస్థ చెపుతుంది…ఆ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* ప్రపంచలోనే అత్యంత తేలికైన, శక్తివంతమైన బైకు

* దీని ఫ్రేమ్‌ను అత్యంత తేలికైన కార్బన్‌ ఫైబర్‌తో నిర్మించారు.

* అలాగే చక్రాలను శక్తివంతమైన మెటీరియల్‌తో తయారు చేశారు.

* బైక్ మొత్తం ఫ్రేమ్‌ బరువు 1.7కిలోలు

* బైకు మొత్తం బరువు 167కిలోలు

* ఈ బైకుకు ఉన్న 1285 ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో దాదాపు 215బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

* అలాగే ట్రాక్షన్‌ కంట్రోల్‌, స్లైడ్‌ కంట్రోల్‌, పవర్‌ లాంఛ్‌, ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిని ఎక్కువగా కూడా తయారు చేయరట కేవలం 500 మాత్రమే తయారుచేస్తారట.