లంబోర్గిని నుండి సరికొత్త కార్

Lamborghini-car-new

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని తన కొత్త ఎక్సట్రీమ్‌ ఎక్స్‌ట్రీమ్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. అవెంటడర్‌ ఎస్‌ ఎల్‌పీ 740–4 కూపే పేరిట విడుదలైన ఈ కారు ధర రూ.5.01 కోట్లు (ఎక్స్‌ షోరూమ్, ముంబై) గా సంస్థ నిర్ణయించింది. 6.2 లీటర్‌ వీ 12 ఇంజిన్‌తో కూడిన ఈ రెండు డోర్ల, రెండు సీట్ల లగ్జరీ కారు 0–100 కి.మీ.వేగాన్ని 2.9 సెకన్లలోనే అందుకోగలదని, గరిష్ట వేగం గంటకు 350కి.మీ. అని సమాచారం.

ఈ కార్ ఫీచర్స్ చూస్తే..

Lamborghini-car

* ఫోర్‌వీల్‌ స్టీరింగ్‌ కార్‌ టెక్నాలజీ
* 7 స్పీడ్‌ డ్యుయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్
* మోనోకోక్‌ కార్బన్‌ఫైబర్‌ చాసిస్
* టెలిమెట్రీ సిస్టమ్
* యాపిల్‌ కార్‌ప్లే తదితర ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తుంది.