లెనోవో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గాయి..

lenevo-z2-plus

ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో..మొబైల్ మార్కెట్ లో దూసుకుపోతుంది. అతి తక్కువ ధరలకే కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తుండడం తో ఎక్కువ మంది వినియోగదారులు లెనోవో మొబైల్స్ ఫై మక్కువ చూపిస్తున్నారు..ఈ నేపథ్యం లో వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది లెనోవో సంస్థ. లెనోవో జెడ్ 2ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరలను భారత్ మార్కెట్ లో తగ్గించిన ధరలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ధర నుండి 2, 3 వేలకు తగ్గించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బ్లాక్ అండ్ వేరియంట్లలో వీటిని అందుబాటులో ఉంచింది.

lenevo-z2-plus2

* జెడ్ 2 ప్లస్ (32 జీబీ ) లాంచింగ్ ధర రూ.17,999 ఉండగా ప్రస్తుత ధర రూ.14,999.

* జెడ్ 2 ప్లస్ 64జీబీ మోడల్ లాంచింగ్ ధర ధర రూ.19,999, ఉండగా తగ్గింపు ధర రూ.17,499 గా సంస్థ ప్రకటించింది.

లెనోవో జెడ్ 2 ప్లస్ ఫీచర్లు :

డ్యూయల్ సిమ్ 4జీ + 3జీ, 5 హెచ్ డీ స్క్రీన్
1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820 ప్రాసెసర్
3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్,
4జీబీ ర్యామ్ 64 జీబీ
13 ఎంపీ రియర్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3500ఎంఏహెచ్ బ్యాటరీ