ఇప్పటికి నోకియా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు…

nokia65 ఏళ్ల క్రితం నోకియా ఫోన్స్ ఎలాంటి సంచలనం సృష్టించాయి తెలియంది కాదు..ఆ తర్వాత మొబైల్ మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ మార్కెట్లోకి రావడం తో నోకియా వంక చూడడం మానేశారు..దీంతో నోకియా సంస్థ నష్టాలూ చవిచూడాల్సి వచ్చింది..ఇటీవల నోకియా మళ్లీ కొత్త హంగులతో ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్ల రూపంలో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. నోకియా బ్రాండ్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజా ఫోన్లను తయారు చేస్తోంది. శుక్రవారం నోకియా 6ను చైనా విపణిలోకి విడుదల చేశారు.

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో జేడీ.కామ్‌ సైట్ లో వీటిని పెట్టగా, కేవలం ఒకే ఒక నిమిషంలో అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ అని దర్శనమివ్వడం షాక్ ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పది లక్షలమంది దీని కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారంటే నోకియాపై ఎంత క్రేజ్‌ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఫోన్‌ ధర భారత కరెన్సీలో రూ.17,000 ఉంటుందని అంచనా. మన దగ్గర ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

నోకియా 6 ఫీచర్లు ఇలా ఉన్నాయి
* 5.5అంగుళాల తాకే తెర
* 1.1గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ అంతర్గత మెమొరీ
* ఆండ్రాయిడ్‌ 7.0
* 16 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా
* 8 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం