చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ వన్‌ప్లస్ వినియోగదారులకు తీపి కబురు తెలిపింది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 6 స్మార్ట్ఫోన్లపై రూ. 2,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఈ ఆఫర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉన్న వారికే వర్తిస్తుందని, ఈ ఆఫర్ జూలై 4వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఇండియాలో వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినప్పటి ధర రూ. 34,999గా ఉండేది. ఆఫర్ తో రూ. 32,999గా అందుబాటులో ఉండబోతుంది.
ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తే..
* 6.28 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే
* 2280 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
* 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
* 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్
* 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* వాటర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్.