గెలాక్సీ ఎ7, ఎ 5 ఫీచర్లు చూసారా..?

samsung-galaxy-a-7,-a-5

ప్రముఖ మొబైల్ దిగ్గజం సామ్ సాంగ్ నుండి ఇప్పటివరకు ఎన్నో మోడల్స్ సరికొత్త ఫీచర్స్ తో వచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ కంపనీ నుండి రెండు సరికొత్త మోడల్స్ విడుదల అయ్యాయి. గెలాక్సీ ఎ7 (2017), గెలాక్సీ ఎ5 (2017) పేరిట మార్కెట్లోకి విడుదల అయ్యాయి. గెలాక్సీ ఎ7 ధర రూ. 33,490 కాగా.. ఎ5 ధర రూ. 28,990. ఈ రెండు ఫోన్లు బ్లాక్ స్కై, గోల్డ్ సాండ్ రంగుల్లో లభించనున్నాయి.

ఈ ఫోన్ లు ఈ నెల 15 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎ సిరీస్‌లోనే మొదటిసారి ఎ7, ఎ5 ఫోన్లు డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తున్నాయి. 2016 తొలిసారిగా గెలాక్సీ నోట్ 7లో ప్రవేశపెట్టిన సామ్సంగ్ క్లౌడ్ స్టోరేజ్, సెక్యూర్ ఫోల్డర్ సదుపాయాలను ఇప్పుడు ఈ ఫోన్లలోనూ కల్పించారు. గెలాక్సీ ఎ7, ఎ5 స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయని సంస్థ తెలిపింది.