సాండిస్క్ నుండి 256 మెమొరీ కార్డ్..ధర ఎంతంటే..?

sandisk

డిజిటల్ ఉత్పత్తుల సంస్థ సాండిస్క్ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల ఉత్పత్తులను అతి తక్కువ ధరలకే అందించి తన ఉనికిని చాటుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఎక్స్‌ట్రీమ్ ప్రో, ఎక్స్‌ట్రీమ్ గో పేరిటా రెండు యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్‌లతో పాటు ఆల్ట్రా 256 జీబీ మైక్రోఎస్డీని సాండిస్క్ విడుదల చేసింది. వీటిలో ప్రధానంగా 256 మెమొరీ కార్డ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యధిక వేగంగా పనిచేసే ఈ ఆల్ట్రా మైక్రోఎస్డీని ఇటీవల లాస్‌వేగాస్‌లో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో సాండిస్క్ ప్రదర్శించడం జరిగింది.

SDXC

ఏప్రిల్ 1 నుండి వీటి అమ్మకాలు మొదలు కానున్నట్లు తెలిపింది. ఇక వీటి ధరను రూ. 18,990 గా సంస్థ నిర్ణయించింది. ఈ మెమొరీ కార్డులో 24 గంటల వ్యవధి కలిగిన ఫుల్ హెచ్‌డీ మూవీని స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా దీనికి 95 ఎంబీ/సెకెన్ స్పీడుతో ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయచ్చు. ఇది ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపైన ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు మాత్రమే ఈ మెమొరీ కార్డ్ సపోర్ట్ చేస్తున్నట్లు సాండిస్క్ తెలిపింది.