గడియారంలాగే ఉండే స్మార్ట్ ఫోన్ ను చూసారా..?

watch-smart-phoneఇప్పటివరకు మనం స్మార్ట్ ఫోన్ లను ప్యాకెట్ లలో పెట్టె విధంగా మాత్రమే చూసాం..కానీ గడియారంలాగే చేతికి మడిచి పెట్టుకునే స్మార్ట్ ఫోన్ లను తయారుచేసారు. ‘ఫ్లెక్స్‌ఫోన్‌’ పేరిట ఈ స్మార్ట్ ఫోన్లను అమెరికాలోని రాయొలే కార్పొరేషన్‌ సంస్థ తీసుకొచ్చింది.

దీన్ని మామూలు ఫోన్‌లాగే చేతిలో పట్టుకోవచ్చు. లేదంటే చేతికి చుట్టేసుకోవచ్చు. కాల్‌ వచ్చినప్పుడు మాట్లాడి మళ్లీ చేతికి తగిలించొచ్చు. అంతేకాదు.. ఇది ఫిట్‌నెస్‌ ట్రాకర్‌గానూ పనిచేస్తుంది. గుండె వేగం ఎలా ఉంది? ఎంత దూరం నడిచాం? అన్న విషయాలనూ చెప్పేస్తుంది. ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేస్తుందట.