భారత్ లోకి లెక్సస్‌ కార్లు..

lexus

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్‌ త్వరలోనే భారత్ లోకి తమ కార్లను లాంచ్ చేయబోతుంది. టయోటాకు చెందిన ఈ మోడల్స్ మొదట మూడు మూడు మోడల్స్ తో భారత్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. మార్చి 24 న ఈ కార్లను లాంచ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. హైదరాబాద్ తో సహా వైజాగ్ , విజయవాడ వంటి నగరాల్లో ఈ కార్లు ను అందుబాటులోకి తీసుకరాబోతున్నారు.

lexus-cars2

ఆర్‌ఎక్స్‌450హెచ్‌ ఎస్‌యూవీ, ఎల్‌ఎక్స్‌450డీ ఎస్‌యూవీ, ఈఎస్‌300హెచ్‌ సెడాన్‌ కార్లు ముందుగా రాబోతున్నాయి.

ఇక ఈ కార్ల ఫీచర్స్ చూస్తే..

* 3.5 లీటర్, వీ6 పెట్రోల్‌ మోటార్
* హైబ్రిడ్‌ సిస్టమ్‌ను ఆర్‌ఎక్స్‌450హెచ్‌ మోడల్‌కు పొందుపరిచారు
* ఆడి క్యూ5, బీఎండబ్లు్య ఎక్స్‌3 మోడళ్లకు ఇది పోటీనిస్తుంది.
* ఎల్‌ఎక్స్‌570 పెట్రోల్‌తో 5.7 లీటర్‌ వీ8 ఇంజన్
* ఎల్‌ఎక్స్‌450డీ డీజిల్‌తో ట్విన్‌ టర్బో 4.5 లీటర్‌ వీ8 డీజిల్‌ ఇంజన్‌ను పొందుపరిచారు.
* ఎల్‌ఎక్స్‌450డీ తొలుత అయిదు సీట్లతో రానుంది.
* రేంజ్‌ రోవర్, ఆడి క్యూ7, మెర్సిడెస్‌ జీఎల్‌కు ఎల్‌ఎక్స్‌ సిరీస్‌ పోటీనిస్తుంది.
*ఎక్స్‌షోరూంలో ధర రూ.1.17 కోట్లు ఉండొచ్చని సమాచారం.