మార్కెట్లోకి రెండు సెల్ఫీ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్..

vivo-plus

ఇప్పుడు సెల్ఫీ మోజు లో పడిపోయారు జనాలంతా..సాధారణ ప్రజల దగ్గరి నుండి సెలబ్రెటీస్ వరకు అందరూ సెల్ఫీ లతో కాలం గడిపేస్తున్నారు..ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ కి ఆదరణ పెరగడం తో పలు సంస్థలు సెల్ఫీ కెమెరాల ఫై ఫోకస్ పెట్టారు..ఇక అన్నిట్లోనూ ముందు ఉండే చైనా కంపెనీ..తాజాగా రెండు సెల్ఫీ కెమెరాలు గల సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకరాబోతుంది…

చైనా కంపెనీ వివో రెండు సెల్ఫీ కెమెరాలు గల ‘వి5 ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో జనవరి 23వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఫోన్ విడుదలకు ముందే వివో వి5 ప్లస్ ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ ధరను రూ.27,980గా సంస్థ ప్రకటించింది..

ఈ ఫోన్ ఫీచర్ల ఫై లుక్ వేస్తే..

vivo-plus5
* ఫ్రంట్ కెమెరాల్లో ఒకటి 20 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్ కాగా.. మరొకటి 8 మెగాపిక్సెల్
* 16 మెగాపిక్సెల్ షూటర్ ను బ్యాక్ సైడ్ అమర్చారు.
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రోఎస్డీతో 256జీబీ పెంచుకోవచ్చు)
* 3160 ఎంఏహెచ్ బ్యాటరీ
* 5.5 అంగుళా క్యూహెచ్‌డీ డిస్ల్పే .