సెల్ఫీ లవర్స్ కు గుడ్ న్యూస్..

selfie-lovers

ఈ మధ్య ఎక్కడ చూసిన సెల్ఫీ ల హావ నే కొనసాగుతుంది..ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు కూడా సెల్ఫీ లు దిగుతూ వారి ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక అలాంటి సెల్ఫీ లవర్స్ కోసం ప్రముఖ మొబైల్ సంస్థ వివో, సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

సెల్ఫీ ఫోకస్డ్ పేరుతో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వివో వై66 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రిలీజ్ చేసింది. దీని ధర రూ.14,999గా సంస్థ నిర్ణయించింది. మార్చి 20 నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులో ఉండనుంది.. క్రౌన్ గోల్డ్, మాట్ బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంచబడింది.

వివో వై66 ఫోన్ ఫీచర్లు చూస్తే :

Vivo-Y66-Smartphone

* 3జీబీ ర్యామ్
* 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
* 256జీబీ వరకు విస్తరణ మెమరీ
* 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
* 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 155 గ్రాముల బరువు
* 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే
* మెటాలిక్ యూనిబాడీ డిజైన్
* 64 బిట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్