వాట్సాప్ సర్వర్ డౌన్.. పిచ్చెక్కిపోయిన జనాలు

సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్ డౌన్ అయ్యాయి. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్ బుక్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక ఫీచర్ల విషయంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రత్యేక పోస్ట్‌లు, ఫొటోలు కనిపించడం లేదంటూ యూజర్లు ఫిర్యాదులు చేశారు.

వాట్సాప్‌లో కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. ఫైల్స్ పంపిస్తుంటే, సెండ్ చేసినట్టు కనిపిస్తున్నాయి కానీ.. ఫొటోలు వీడియోలు, మెసేజ్‌లు సరిగా కనిపించడం లేదు. “ఇన్‌స్టాగ్రామ్ డౌన్”, “ఫేస్‌బుక్ డౌన్” వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో తమకు ఎదురవుతోన్న ఇబ్బందులను ట్విట్టర్‌లో పంచుకున్నారు . గత మార్చిలో కూడా ఫేస్ బుక్, వాట్స్‌కు ఇలాంటి సమస్య వచ్చింది.