వాట్సాప్ యూజర్లు ఇది గమనించండి..

Whatsapp-risk

ఇప్పుడు చాలామంది వాట్సాప్ తోనే టైం గడిపేస్తున్నారు ప్రతి ఒక్క దానిని వాట్సాప్ తోనే పంచుకుంటున్నారు. ఈ నేపథ్యం లో దీని ద్వారా ఎంతో ఉపయోగం ఉందొ , అదే రీతిలో చెడు కూడా ఉందని తెలుస్తుంది..అందుకే యూజర్లకు మరింత భద్రత చేకూర్చడం కోసం మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ వాట్సాప్ వెరిఫికేషన్‌ను మరింత కట్టుదిట్టం చేసింది.

Whatsapp

యూజర్ల ఖాతాల భద్రత కోసం రెండంచెల వెరిఫికేషన్‌ను ప్రవేశపెడుతున్నట్టు సమాచారం. ఈ విధానం కోసం వాట్సాప్ గత కొన్ని నెలలుగా పనిచేస్తోంది. వాట్సాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఫోన్ నంబరును సరిచూసుకోవాలంటే తొలుత ఆరంకెల పాస్‌కోడ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. వెరిఫికేషన్ ప్రాసెస్‌ కోసం యూజర్లు మొదట ’సెట్టింగ్స్’లోకి వెళ్లి తర్వాత ‘అకౌంట్’ను టాప్ చేయడం ద్వారా రెండంచెల వెరిఫికేషన్‌ను పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్ అన్ని వాట్సాప్ మొబైల్స్ లలో వర్క్ అవుతుంది..