షావోమి నుండి వైఐ డాష్ కెమెరా..

ప్రముఖ చైనా సంస్థ షావోమి తాజాగా మార్కెట్లోకి వైఐ డాష్ కెమెరా ను తీసుకొచ్చింది. మానిటరింగ్ సిస్టమ్‌లాగా ఇది పనిచేయడం ప్రత్యేకత. ఈ కెమెరాను కారుకు కూడా ఫిక్స్ చేసుకోవచ్చట . మీరు కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ప్రతీదీ కెమెరాలో రికార్డ్ అవుతుందని సంస్థ తెలిపింది.

దీని మరిన్ని ఫీచర్లు చూస్తే..

* డైలీ ఈవెంట్స్‌ను రికార్డు చేసుకోవచ్చు
* ఈ కెమెరాతో 165 డిగ్రీల్లో హైడెఫినేషన్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు
* ఇందులో మెమరీ కార్డు పెట్టుకోవచ్చు
* అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్
* వైఐ స్మార్ట్ డాష్ కెమెరా‌లో 2.7 అంగుళాల స్క్రీన్ ఉంటుంది
* జీ సెన్సర్ మొదలగు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇక దీని ధర వచ్చేసి రూ.5,200. ప్రమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా కంపెనీ దీన్ని రూ.699 తక్కువకు ఇస్తోంది.