ఏడు బందులవాడా !!

బ్రహ్మోత్సవ శ్రీవారికి
బందులతో విల విలా !
వెలాతెలా పోతోందట
ఘన తిరుమల కోవెలా !!

వైభవంగా ముగిసేనా
అయ్య పెళ్లి పండుగా !
సప్తగిరులు మురిసేనా
కొండ గుండెనిండుగా !!

సామాన్యుడి బతుకుబరువు
సమ్మెలు నిరసనల హొరు !
పెళ్ళికి వచ్చే పెద్దల
ప్రయాణాలు తారుమారు !!

నువ్వయినా కనికరించి
సమస్య పరిష్కరించూ !
ఇకనైనా ఈ రాష్ట్రం
భవితను పరిరక్షించూ !!

– ఏవీయస్