శత(అవ)మానం భవతి

చెన్నై లో జరిగిందట
వంద ఏళ్ళ సినిమా సభ !
వెలా తెలా పోయిందట
తెలుగుచలన చిత్ర ప్రభ !!

మన జాతిని మన భాషను
గౌరవించలేనప్పుడు !
ఎందుకయ్య ఇన్నికోట్ల
గానాబజానా చప్పుడు !!

కొంతమంది మెహర్బాని
ఎందుకింత ఆరాటం !
నిర్వాకం చేతకాని
గతితప్పిన కోలాటం !!

పెద్దల స్మరియించుకోని
ఉత్సవాలు శుద్ధ వేస్టు !
విలువలు పాటించనపుడు
మిన్నకుండటం బెస్టు !!

– ఏవీయస్