యువరాజస్వామ్యం

రాహుల్ మాటకు వగచిన
మన్మోహన నాయకుడు !
ఆర్డినెన్స్ చించేసిన
అపశ్రుతుల గాయకుడు!!

ప్రజాస్వామ్య దేశంలో
యువరాజు ప్రతాపం !
దేశం చవిచూసిందట
నిస్సిగ్గుకు ప్రతిరూపం !!

కోట్ల మంది గొంతులెత్తి
గుండె బాదుకుంటున్నా !
చెవికెక్కదు ఇదేం వింత
మనసులవిసి పోతున్నా!!

భరతజాతి అంటేనే
సోనియమ్మ కుటుంబం !
రాష్ట్రాలన్నీ కలిపిన
పిచ్చపూల కదంబం!!

– ఏవీయస్