‘బిగ్‌బాస్ గణపతి’ ని చూసారా..?

తెలుగు రియాల్టీ షో గా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 2 కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడం తో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో అనే ఆత్రుత అందరిలో నెలకొని ఉంది. ఇదిలా ఉంటె తాజాగా వినాయక ఉత్సవాల్లో సైతం బిగ్ బాస్ సందడి చేయడం చర్చ గా మారింది. నిన్న దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రులు మొదలైన సంగతి తెలిసిందే.

వినాయకచవితిని పురస్కరించుకుని ‘బిగ్ బాస్ గణపతి’ పల్లెల్లో పట్టణాల్లో కొలువుదీరాడు. కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చొన్న గణపతి విగ్రహం, ‘బిగ్‌బాస్‌’ థీమ్‌తో ఏర్పాటు చేసిన వినాయకపందిళ్లు సైతం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే కౌశల్‌ ఆర్మీ పేరుతో ఒక వినాయక మండపాన్నే ఏర్పాటు చేయటం విశేషం. ‘బిగ్‌బాస్‌ 2’లో వినాయక పూజా మహోత్సవాలు అంటూ మరో మండపం ఏర్పటు చేసారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సందడి ఏ రేంజ్ లో ఉందో ఈ మండపాలు చూస్తే అర్ధం అవుతుంది.

గతం లో సినిమా హీరోలతో కూడిన గణేష్ మండపాలు ఉండేవి..ఈ ఏడాది మాత్రం బిగ్ బాస్ సీజన్ 2 కు సంబందించిన మండపాలు కొలువుదీరడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.