బిగ్ బాస్ స్టేజ్ ఫై ఫ్యామిలీ హీరో..

బిగ్ బాస్ 3 సీజన్ ఈరోజు తో పూర్తి అవుతుంది. మరికొన్ని గంటల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలనుంది. ఇక ఫైనల్ ఈవెంట్ ను బిగ్ బాస్ యాజమాన్యం ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ ఫినాలే కోసం చాలామంది స్టార్స్ ను దింపింది. దీని తాలూకా ప్రోమోను రిలీజ్ చేసారు.

బుల్లితెర యాంకర్లు, పలువురు సెలబ్రిటీలు కూడా ఫినాలేకు వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ ‘షూటింగ్‌ అయినా మానేస్తా కానీ బిగ్‌బాస్‌ మాత్రం మానను’ అని చెప్పుకొచ్చాడు. మరోపక్క సోషల్ మీడియా లో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ అని..కాదు కాదు శ్రీ ముఖి అని అంటున్నారు. అసలు ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది.