చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ 3 టైటిల్ అందుకున్న రాహుల్..

మొత్తానికి బిగ్ బాస్ 3 సీజన్ టైటిల్ ను రాహుల్ కైవసం చేసుకున్నారు. గత రెండు రోజులుగా టైటిల్ శ్రీముఖి కా..రాహుల్ కా అనే టెన్షన్ లో అభిమానులు , బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు. వారి టెన్షన్ కు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ ను దక్కించుకున్నాడు రాహుల్. రాహుల్ కు గట్టి పోటీ ఇచ్చిన శ్రీముఖి లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ఈ షోద్వారా రాహుల్ రూ. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీగెలుచుకున్నారు.

రూ. 50 లక్షలతో ఏం చేస్తావ్ అని అంటే రాహుల్ అడుగగా..‘సార్.. ఫస్ట్ ఆ డబ్బుతో ఓ బార్బర్ షాప్ పెడతా.. నాకు పాటలు పాడటం కంటే కూడా నా కులవృత్తి అంటే నాకు ఇష్టం. ఆ పనిచేయడానికి గర్వపడతా’ అని ఒకే ఒక్క డైలాగ్‌తో ఆయా వర్గాలను కట్టిపడేశాడు. తన నేటివిటీని ఒరిజినాలిటీని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తను బార్బర్ అనే విషయాన్ని ప్రమోట్ చేసుకుని సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్.