బిగ్ బాస్ 3 టైటిల్ విజేత రాహులే..

గత 105 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ 3 నేటితో ముగుస్తుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఫైనల్ కు శ్రీముఖి , రాహుల్ , అలీ , వరుణ్ , బాబా భాస్కర్ లు చేరగా..ఈ ఐదుగురిలో రాహుల్ – శ్రీ ముఖి మధ్యనే అసలైన టైటిల్ పోరు జరిగింది. ప్రస్తుతం పోలింగ్ శాతం బట్టి రాహుల్ టైటిల్ విన్నర్ అయినట్లు తెలుస్తుంది.

నిన్నటి వరకూ ఈ ఇద్దరికీ టై కాగా.. చివరి రోజున రాహుల్ పుంజుకుని కేవలం ఒక్క శాతం ఓట్లుతో ముందంజలో ఉన్నారు. రాహుల్ సిప్లిజంగ్ 32 శాతం ఓట్లు సాధించి తొలి స్థానంలో ఉండగా.. శ్రీముఖి 31 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక బాబా భాస్కర్ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉండగా.. వరుణ్ సందేశ్ నాలుగో స్థానంలో ఉన్నారు. అలీ రెజా 4 శాతం ఓట్లతో చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు.