బిగ్ బాస్ పై పరచూరి సంచలన వ్యాఖ్యలు

‘ఒక పెద్దవాడిగా బిగ్‌బాస్‌ షోలో జరుగుతున్న కొన్ని అంశాలు జీర్ణించుకోలేకపోతున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. భారతదేశ వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనమరుగవుతున్న రోజుల్లో ఎలాంటి రక్త సంబంధం లేని 14మందిని ఒక ఇంట్లో కూర్చోబెట్టి, 70రోజుల పాటు రియాల్టీ షో నడపాలంటే భాష, సమయస్ఫూర్తి కావాలి. అయితే, ఇప్పుడు నా ఆవేదన పంచుకోవడానికి వచ్చా. ఒక పెద్దవాడిగా బిగ్‌బాస్‌ షోలో జరుగుతున్న కొన్ని అంశాలు జీర్ణించుకోలేకపోతున్నా. ఈ విషయం చాలా రోజుల నుంచి చెబుతామని అనుకుంటున్నా. కానీ, చివర్లో చెబితే బాగుంటుందని అనిపించింది.

ఒక అమ్మాయి శారీరకంగా మగవాడితో పోల్చుకుంటే తక్కువ బలంగా ఉటుంది. ఇది దేవుడి సృష్టి. అలాంటి అమ్మాయిలను గౌరవించాలి. కానీ బిగ్ బాస్ లో అది కనిపించడం లేదు. అక్కడ పెడుతున్న టాస్కులు మరీ దారుణంగా వుంటున్నాయి. మొన్న కార్ టాస్క్ చూశాను. ఇద్దరు అమ్మాయిలపై ఆ అబ్బాయిలు చేసిన బలప్రయోగం చూస్తే కడుపు తరక్కుపోయింది. ఇది మంచి పద్దతి కాదు’ అని చెప్పుకొచ్చారు పరుచూరి.