మరో రెండు నెలలు సింగిల్ సినిమాలే..

మొన్నటి వరకు వారానికి రెండేసి, మూడేసి సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఏం చూడాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చాయి..కొన్ని సినెమాలకైతే థియేటర్స్ కూడా కరవై, ప్రేక్షకులు చూసేలోపే మంచి క్వాలిటీ ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చాయి..కానీ ఇప్పుడు వచ్చే రెండు నెలల్లో ఆ పరిస్థితి లేదు..ప్రతి వారం కేవలం ఒకే ఒక సినిమా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

ముందుగా ఫిబ్రవరి 08న మాజీ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారం గా తెరకెక్కిన యాత్ర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి పోటీగా ఏ సినిమా రావట్లే..

ఫిబ్రవర్ సెకెండ్ వీక్ లో కార్తీ-రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటించిన దేవ్ సినిమా రాబోతుంది..దీనికి పోటీగా కూడా ఏ సినిమా రావట్లే.

ఫిబ్రవరి మూడో వారం ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 మహానాయకుడు విడుదల కాబోతుంది. ఇది కూడా సింగిల్ గానే వస్తుంది.

ఇక మార్చి ఒకటో తారీఖు మాత్రం రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. కళ్యాణ్ రామ్ 118, అల్లుశిరీష్ ఎబిసిడి సినిమాలు ఒకేరోజు విడుదలయ్యే ఛాన్సులు కనపడుతున్నాయి. ఆ తర్వాత పరీక్షలు మొదలు కావడంతో సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. వచ్చిన కానీ అవన్నీ చిన్నచితక చిత్రాలే.

ఇక అసలైన సినిమా పండగా ఏప్రిల్ నెల నుండి మొదలు కాబోతున్నాయి. అవి ఎలా ఉండబోతాయి అనేది చూడాలి.